మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశామని తెలిపారు.