యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలోని 13వ వార్డు ప్రగతి నగర్ లోని బొక్క లక్ష్మయ్య ఇంటిపై జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని గురువారం సాయంత్రం CPM ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ.. ప్రగతి నగర్ లోని బొక్క లక్ష్మయ్య ఇంటిపై జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్ తో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు CPM ఆధ్వర్యంలో చేపడుతామని హెచ్చరించారు.