మంచిర్యాల పట్టణంలోని మెడికల్ & నర్సింగ్ కాలేజ్ లో మంగళవారం మధ్యాహ్నం ఏసిపి ప్రకాష్, సిఐ ప్రమోదు రావుల ఆధ్వర్యంలో యాంటీ రాగింగ్ పై మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా ర్యాగింగ్ కి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ర్యాగింగ్ కి గురైతే వారు నిర్భయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలని సూచించారు.