హైదరాబాద్ కూకట్పల్లిలో రేణు అగర్వాల్ బుధవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న రోషన్, హర్షి కలిసి రేణు చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి, చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్ తో కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం భారీ నగదు, బంగారం దోచుకున్నారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపైనే పరారైన దృశ్యాలు గురువారం పోలీసులు అక్కడి సీసీటీవీని పరిశీలించారు.