మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో ఇవాళ మధ్యాహ్నం జాతీయ రహదారిపై నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డుపై ఒక కారు అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వస్తున్న నాలుగు కార్లు ఢీకొట్టాయి. ప్రమాదంలో కారులో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొద్దిసేపుకు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.