నల్గొండ జిల్లా, అనుముల మండలం, హాలియా పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాలయాలు ఆధునిక దేవాలయాలని వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా, వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.