నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని జనహిత కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం ఉదయం విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించడం ప్రజాక్షేత్రంలోని అధికారులు తీసుకువెళ్లడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.