తిరుపతి జిల్లా నాయుడుపేట సెజ్కు మరో పరిశ్రమ రానుంది. దాదాపు రూ.1600 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సిర్మా టెక్నాలజీస్ శుక్రవారం ప్రకటించింది. 2వేల మందికిపైగా ఉద్యోగాలు ఇస్తామని ఈ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో 26.70 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, కాపర్ క్లాడ్ లామినేట్ తదితర పరికరాలు ఇక్కడ తయారు చేయనున్నారు. దీంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.