సిరికొండ మండలం లోని రావుట్ల గ్రామంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శిబిరానికి వచ్చిన వారికి యాంటీన్ ఎక్స్రేలు తీసి షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి వ్యాధులు ఉన్న నిర్ధారించి,ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామీన ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిబి ప్రోగ్రాం అధికారులు, ఎక్స్రే సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.