అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో నవీన్ కుమార్ అనే యువకుడు సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలూరు గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కుమార్ పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి రమాదేవి ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు