శనివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెడ్ కోర్స్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పోలీస్ కమిషనర్. ఈ సందర్భంగా డయల్ హండ్రెడ్ మరియు అత్యవసర కాల్స్ స్వీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ప్రతి కాల్ కి బాధ్యతగా సమాధానం చెప్పి వారి సమస్యలను పరిష్కరించే దిశగా వారితో మాట్లాడాలని ఆయన తెలిపారు.