రాష్ట్రంలోని దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు పెంపు చరిత్రాత్మకమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో కలిసి సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వృద్ధులకు ఇంటికి పెద్ద కొడుకుగా వారికి అండగా నిలుస్తూ 6వేల రూపాయలు పింఛన్ అందిస్తున్నారని అన్నారు.