మంత్రాలయం :మండలంలోని వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో మంగళవారం మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్సై శివాంజల్ సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవ్ యాప్ ద్వారా అనుమతులు కచ్చితంగా పొందాలని నిర్వాహకులకు సీఐ సూచించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ఉండాలని ఎస్సై శివాంజల్ తెలిపారు.