వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుండి భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా వరంగల్ నగరంలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. అందులో ముఖ్యంగా ఎల్బీనగర్ ఉర్సు శాఖ రాసుకుంటా చిన్నపడ్డపల్లి రంగసాయిపేట లెనిన్ నగర్ బి ఆర్ నగర్ వంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి నెలకొంది. ఇండ్లలోకి నీరు వచ్చి కొన్ని కాలనీలో ఇప్పటివరకు కరెంట్ రాని పరిస్థితి నెలకొంది. నగర ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.