సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ గ్రౌండ్లో శుక్రవారం నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని క్రీడ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు మంచి క్రీడలను గుర్తించి జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.