నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సిపి సాయి చైతన్య మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సిపికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయ విశిష్టతను ఆలయ పురోహితులకు అడిగి తెలుసుకున్నారు.