బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, కె.డబ్ల్యూ.డి కెనాల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రూరల్ వాటర్ సప్లై, మున్సిపల్ కమిషనర్లతో ఎంపీ ల్యాడ్స్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీ ల్యాడ్స్ ద్వారా మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేసి, బిల్లులను ముఖ్య ప్రణాళిక అధికారికి పంపాలని అధికారులను ఆదేశించారు.