అమీన్ పూర్ మండలం క్రిష్టా రెడ్డి పేటలోని రెయిన్ మెడోస్ కాలనీ నివాసులంతా డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించవలసిందని స్థానిక అధికారులకు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని, నివాసుల చట్టబద్ధ హక్కులను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా MLC అంజిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానికులకు ఎప్పుడూ అండగా ఉంటామన్న హామీ ఇచ్చారు.