హనుమకొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం వరంగల్ కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా వర్షాల వల్ల ఏదైనా సమస్య ఉన్నా,నా దృష్టికి లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.కాలనీ లో నీళ్లు నిలిచిన చోట అధికారులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.