మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో బుధవారం మధ్యాహ్నం 3:00 లకు ఒ యువకుడు నిరసన చేపట్టాడు. ప్లకార్డులతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు మోకాళ్లపై నడిచి నిరసన చేపట్టారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె కులానికి అసెంబ్లీలో 10 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయినా చాకలి ఐలమ్మ కులానికి 10 సీట్లు ఇచ్చినప్పుడే ఆమెకు ఘనమైన నివాళి ప్రకటించిన వాళ్లు ఐతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.