పాలకపక్షం, అధికారుల అక్రమాలు, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొట్లూరి సత్యనారాయణ స్పష్టం చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని సచివాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటల నుండి అర్ధ నగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. సత్యనారాయణ మాట్లాడుతూ మార్చి 31వ తేదీ నాటికి టెండర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉండగా. తుంగలో తొక్కి ఆగస్టు మాసం ముగిసిపోతున్న అధికారులలో చలనం లేకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి అధికార దుర్వినియోగం పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు