Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
ప్రజా ప్రభుత్వంలో ప్రతీ అర్హులైన వారందరికీ సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు. పేద, నిరుపేదలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో చాలా కాలం తర్వాత ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, ఆఫీసుల చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరిగి అలిసిపోయారే, తప్ప వారికి ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.