కోదాడ పోలీస్ సబ్ డివిజన్ లోని కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని డిఎస్పి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుండి అక్రమంగా ఇసుక లారీలలో గాని ట్రాక్టర్లలో గాని తరలిస్తే ఆయా వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.అదేవిధంగా ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా పేకాట లేదా ఇతర జూద క్రీడలు ఎవరైనా నిర్వహించిన లేదా ఆడినా వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అన్నారు.