అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాయాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ వద్ద ఈనెల 1న విజయదశమి ఆయుధపూజ సందర్భంగా వ్యవసాయ మోటార్లకు పూజ చేస్తూ కాలు జారి కాలువలో పడి గల్లంతయిన వ్యవసాయ కూలీ రామాంజనేయులు (50) కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాలువలో గాలింపు చేపట్టారు. ప్రత్యేక బోట్లను వేసుకుని కాలువలు తిరుగుతూ గాలింపు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు దిగాలు చెందుతూ ఉండిపోయారు.