అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కమ్మూరు గ్రామం వద్ద రైతు ఓబయ్య సాగు చేసిన బొప్పాయి తోటను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వర్షం కురుస్తున్న కూడా జిల్లా ఉద్యాన శాఖ అధికారులతో కలిసి తోటను పరిశీలించారు. రైతు ఓబయ్య 8 ఎకరాల్లో సాగుచేసిన బొప్పాయి తోటకు సంబంధించి మార్కెటింగ్ విషయాలతో పాటు ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను రైతులతో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షాల కారణంగా ధర పూర్తిగా పడిపోయిందని సీజన్ సమయంలో ఢిల్లీ బాంబే కలకత్తా చెన్నై నగరంలో మంచి డిమాండ్ ఉండేదని ప్రస్తుతం ధరలు లేక వ్యాపారం సైతం తోటి వద్దకు రాలేదని రైతు కలెక్టర్ కు వివరించారు.