ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదవ తరగతి, ఇంటర్ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు, బుధవారం మీడియా విడుదల చేసిన ప్రకటనలో, చదువు మధ్యలో ఆపేసిన వారికి ఇదొక సువర్ణ అవకాశమని, చదువుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.