యూరియా కొరతను నిరసిస్తూ రైతులు శుక్రవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో నిలబడిన యూరియా లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.