యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలోని చౌక్ల తండా, బాబు నాయక్ తండ, ముస్తాపూర్ గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను, నర్సరీలను, ప్రైమరీ స్కూల్ లను, అంగన్వాడీలను శనివారం మధ్యాహ్నం జిల్లా పంచాయతీ అధికారి సునంద ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.