Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. మత సామరస్యాలకు వినాయక చవితి పండుగ నిలయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.