స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెన్షన్లు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, స్త్రీ నిధి, లైవ్లీ హుడ్స్, అక్షర ఆంధ్ర లెటరసీ కార్యక్రమం పై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.