మడకశిర పట్టణం శివాపురం ఒకటో వార్డు సమీపంలో బుధవారం మధ్యాహ్నం కే ఎస్ ఆర్ టి సి బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని పావగన్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఈ కర్ణాటక ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో మడకశిర పట్టణంలోని శివపురం వద్ద ప్రధాన రహదారి పక్కకు వెళ్లి ఆగిపోయింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.