ఎన్ఎస్పీ లిఫ్టులపై కాపర్ తీగలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. రైతులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందినవారుగా గుర్తించినట్లు వివరించారు.