దూరదృష్టితో.. ఒక సంకల్పంతో.. కఠోర దీక్షతో... సిద్దిపేట ప్రాంతంతో పాటు నాలుగైదు జిల్లాల రైతాంగానికి మేలు చేకూర్చే దిశగా కెసిఆర్, హరీష్ రావు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రైతాంగం పట్ల, రైతుల బాధలు, కష్టాలను కనులారా చూసిన గొప్ప నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ ప్రాంత రైతు