శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో సత్యసాయి జిల్లా డిగ్రీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 9వ తేదీన మారథాన్ 5K రెడ్ రన్ పోటీలు జరుగుతున్నాయి. యువత లో హెచ్.ఐ.వి. పట్ల అవగాహన కొరకు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 5 కిలోమీటర్ల మారథాన్ రెడ్ రన్ కార్యక్రమం 9- 09- 2025 నాడు హిందూపురం లో నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు 17-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు అయి ఉండాలి. సత్యసాయి జిల్లాలో ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉండాలి.