యూరియా, డీఏపి వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. యూరియాతోపాటు వారికి అవసరమైన ఎరువులు అందించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురిచేస్తుందని అన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు యదేచ్చంగా తరలిస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, ఈ జిల్లాలో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎరువులు సక్రమంగా అందించకపోవడం సిగ్గుచేటునన్నరు