ఎమ్మిగనూరు : దశమి ఉత్సవాలపై ఎమ్మెల్యే బీవీ సమీక్ష..గోనెగండ్లలో ఈనెల 12, 13వ తేదీల్లో శ్రీ చింతలముని, నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో MLA బీవీ జయ నాగేశ్వర రెడ్డి మండల స్థాయి అధికారులతో MPDO కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. SS ట్యాంక్కు రూ.2.5 కోట్లతో మైక్రో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి, స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామన్నారు. దశమి ఉత్సవాలకు అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తామన్నారు.