ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్ర ప్రభుత్వం తగ్గించినా మాట్లాడటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం లేదా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదని, కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.