సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని నెమ్మికల్లులో శ్రీ దండు మైసమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఆదివారం ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. దండు మైసమ్మ తల్లి ఆశీస్సులు సూర్యాపేట ప్రాంత ప్రజలందరికీ ఉండాలని రైతులు పాడిపంటలతో పశువు సంపదతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కరుణాకర్ రెడ్డి భక్తులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.