బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అసెంబ్లీలో ఆమోదించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ వారు మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వాల అయంలో సాధ్యం కానీ రిజర్వేషన్లు సాధించిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వనీకే సాధ్యం అయిందన్నారు.