Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: పట్టణంలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, కుక్కలను అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Nalgonda, Nalgonda | Sep 13, 2025
నల్గొండ పట్టణంలోని రాంనగర్ పార్కులో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రోడ్లు భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించి, పలువురికి కుక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ఇబ్బందులు పడుతున్నారని, నల్గొండ పట్టణంలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us