హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామ్చందర్ రావ్ ఆధ్వర్యంలో సేవ పక్షం సమావేశం నిర్వహించారు. సేవా కార్యక్రమాల ద్వారా బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయన సూచించారు. పార్టీ ఇచ్చే ప్రతి పిలుపునకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు చేర్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.