ఈనెల 28, 29వ తేదీల్లో కొయ్యూరు మండలంలోని పీవీటీజీ గ్రామాలు కలిగిన 23 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు బుధవారం సాయంత్రం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదికర్మయోగి కార్యక్రమంపై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఉంటుందన్నారు. ఈమేరకు ఆయా పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది హాజరు కావాలని సూచించారు.