చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నగిరి ప్యాలెస్ ఆవరణంవద్ద వెలసి ఉండు శ్రీ వీరభద్ర స్వామి జయంతి మహోత్సవాలను మంగళవారం ఉదయం నుంచి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు రుద్రాభిషేకాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారిని మంగళవారము సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వందల సంఖ్యల భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరశైవ జంగమ. లింగాయత్ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.