ఆత్మకూరు ఆటవీ డివిజన్ నల్లమలలో వన్యప్రాణి వేటగాళ్ల అలజడి మొదలైంది. 20 రోజులుగా నల్లమలలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటవీ అధికారుల కళ్ళుగప్పి వన్యప్రాణి వేటగాళ్లు నల్లమలలోకి ప్రవేశించారు.బైర్లూటి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నాటు తుపాకితో వేటకు వెళ్లిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కమల్ అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసి అతని పై కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరిచారు.ఆత్మకూరు మండలం, సిద్దాపురం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో కలిసి వేటకు వెళ్లిన కమల్ ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకోగా మిగిలిన ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నాలుగేళ్ల కాలంగ