మడకశిర పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీలకు సీఐ నగేష్ బాబు పలు సూచనలు జారీ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఐదు మందికి తగ్గకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఉండాలని,అనుమతుల కోసం స్టేషన్కు రావాల్సిన అవసరం లేదన్నారు. వెబ్ సైట్ లో గణేష్ ఉత్సవంనెట్ లో లాగిన్ అయ్యి అక్కడ సూచించబడిన వివరాలు నమోదు చేయాలన్నారు.అనంతరం తమ స్టేషన్ లాగిన్ లోకి వస్తే అనుమతి ఇస్తామన్నారు.