అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో శనివారం ఆటోను వెనుక నుంచి అబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణంలో నుంచి ఆటో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను డ్రైవర్ షడన్ గా బ్రేక్ వేశాడు. అయితే వెనుక ఉన్న అంబులెన్స్ ను డ్రైవర్ నియంత్రణ చేసుకోలేక ఆటోను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఆటోలో ఉన్న తిరుమల, నరసింహ, ఆటో డ్రైవర్ ఖాజావలి, అంబులెన్స్ లో ఉన్న లక్ష్మణ్, వేణు లకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.