బజార్హాత్నూర్ మండలం డెడ్రా గ్రామం లో మహిళ పై చిరుతపులి దాడి చేసిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. డెడ్రా గ్రామంకు చెందిన అర్క భీమబాయి అనే మహిళ బహిర్భూమికి వెళ్తున్న క్రమంలో చిరుతపులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. చిరుతపులి దాడిలో మహిళ ముఖంపై గాయలయ్యాయి. స్థానిక పీహెచ్సిలో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు.మహిళపై చిరుత దాడితో గ్రామస్తులు భయ బ్రాంతులకు గురవుతున్నారు.