ఇంద్రవెల్లి మండలంలోని ఆదివాసిగూడాల్లో గుస్సాడి,దండారి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.సమక్క గ్రామంలో నిర్వహించిన దండారి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్చార్జి ఆత్రం సుగుణక్క,గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ కొట్నాక తిరుపతి పాల్గొని సందడి చేశారు.ఆదివాసి సాంప్రదాయ దుస్తులు ధరించి మహిళలతో కలిసి సుగుణక్క దండారి నృత్యం చేశారు.దండారి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి 50 లక్షల రూపాయల నిధులను కేటాయించిందని అన్నారు.ఈ నిధులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక వెయ్యి గ్రామాల్లోని దండారి వేడుకలకు రూ.15 వేల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.