క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ధారుఢ్యానికి ఎంతగానో తోడ్పడతాయని మండల విద్యాధికారి లోకిని కిషన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను వారు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులపాటు హై స్కూల్ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్,ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.