సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా మూసియాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ అన్నారు. ఆదివారం రాత్రి గణేశుల నిమజ్జనోత్సవాలను పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సంగారెడ్డి మహబూబ్నగర్ చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవాల ను మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తో కలిసి పరిశీలించారు. నిమజ్జనోత్సవాల ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లాలోని హిందీ సంఘాల నాయకులకు గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.